మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది.. కొంతమందికి ఫ్రీగా ఉంటే మరికొంతమందికి మాత్రం విపరీతమైన నొప్పి ఉంటుంది… ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన నొప్పులు ఉంటాయి..నెలసరి సమయంలో గర్భాశయ కండరాలు సంకోచించడం వల్ల ఈ నొప్పి కలుగుతుంది. నొప్పితో పాటు తల తిరిగినట్టుగా ఉండడం, వాంతులు, తలనొప్పి, డయేరియా వంటి లక్షణాలు కూడా నెలసరి సమయంలో కొందరు స్త్రీలల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది స్త్రీలు ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు..అయితే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఈ సమయంలో మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది..శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉండడం వల్ల ఈ నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం కండరాలకు విశ్రాంతి కలిగించడంతో పాటు నొప్పిని కలిగించే ప్రోస్టాగ్లాండిన్ లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నెలసరి సమయంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, అరటి పండు, ఉసిరికాయ, అవకాడో వంటి వాటిని తీసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి.. ఇంకా కొంతమంది పెరుగును కూడా తీసుకుంటారు.. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి..
ఇకపోతే పుట్ట గొడుగులు, కోడిగుడ్డు పచ్చసొన, సాల్మన్ చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎండలో కూర్చోవడం వల్ల కూడా తగినంత విటమిన్ డి ని పొందవచ్చు. అలాగే విటమిన్ ఇ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి..అది ప్రోస్టాగ్లాండిన్ గా మారకుండా అడ్డుకుంటుంది. దీంతో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. పల్లీలు, బాదంపప్పు, కివీ, బ్రకోలి, వివిధ రకాల గింజల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది.. మహిళలు నెలసరి సమయంలో ఈ మూడు విటమిన్స్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం మంచిది.. నీళ్లు కూడా ఎక్కువగా తాగడం మంచిది..ఈ వేసవిలో ఎంత తాగితే అంత మంచిది..