NTV Telugu Site icon

New Credit Card: కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. రివార్డుల ఎంపిక మీచేతుల్లోనే..

New Project (38)

New Project (38)

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. అన్ని రకాల ఉద్యోగులు వాటిని వినియోగిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కో బ్రాండెడ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ – ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్ -యాక్సిస్ వంటి వాటితో పాటు ట్రావెల్, షాపింగ్, డైనింగ్, ఫ్యూయల్ రివార్డులు అందించే కార్డులూ ఉన్నాయి. అయితే ఒక కేటగిరీకి చెందిన కార్డు తీసుకుంటే మిగిలిన వాటిపై రివార్డు పాయింట్లు కోల్పోయినట్లే. మరో క్రెడిట్ కార్డు తీసుకోవాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి సమస్య లేకుండా ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సరికొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డును ఇటీవల తీసుకొచ్చింది. ఇందులో ఓ అద్భుతమైన ఆఫర్ ను పెట్టింది. ఇందులో రివార్డు ప్రోగ్రామ్‌ను మీరే కస్టమైజ్ చేసుకోవచ్చట. ఐదు రకాల కేటగిరీల్లో ఏదైనా రెండింటిని ఈ కార్డు యూజర్లు ఎంచుకోవచ్చు. వాటిపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి ఆయా కేటగిరీలను మార్చుకోవచ్చుట. ఎలాంటి ఛార్జిలు కూడా వర్తించవు. హెచ్‌డీఎఫ్‌సీ చెందిన పేజ్ యాప్‌లో మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించింది బ్యాంక్.

READ MORE: Bank FD: సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులేవో తెలుసా?

వివిధ కేటగిరీలు.. డైనింగ్, ఎంటర్‌టైన్మెంట్- బుక్ మై షే, జొమాటో- ట్రావెల్- మేక్ మై ట్రిప్, ఉబర్ – గ్రాసరీ- బ్లింకిట్, రిలయన్స్ స్మార్ట్ బజార్ – ఎలక్ట్రానిక్స్- క్రోమా, రిలయన్స్ డిజిటల్ – ఫ్యాషన్- నైకా, మింత్రా ఇలా ఉన్నాయి. ఈ కేటగిరీల్లో ఏవైనా రెండింటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటిపై ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ వేదికలపై 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుంటే 3 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ కార్డు జాయినింగ్ ఫీ రూ.500 గా ఉంది. కార్డు తీసుకున్న 90 రోజుల్లో రూ.20 వేలు ఖర్చు చేస్తే ఫీ రద్దవుతుంది. ఏడాదిలో రూ.1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీ చెల్లంచాల్సిన అవసరం లేదు. రివార్డుల రూపంలో వచ్చిన క్యాష్ పాయింట్లు పేజ్ యాప్ వాలెట్‌లో జమ అవుతుంది. యాప్‌లోనే రిడీమ్ చేసుకోవచ్చు. ఈ కార్డు కావాలంటే మీరు పేజ్ యాప్‌లో దరకాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.