New Credit Card: కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. రివార్డుల ఎంపిక మీచేతుల్లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. అన్ని రకాల ఉద్యోగులు వాటిని వినియోగిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కో బ్రాండెడ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ – ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్ -యాక్సిస్ వంటి వాటితో పాటు ట్రావెల్, షాపింగ్, డైనింగ్, ఫ్యూయల్ రివార్డులు అందించే కార్డులూ ఉన్నాయి. అయితే ఒక కేటగిరీకి చెందిన కార్డు తీసుకుంటే మిగిలిన వాటిపై రివార్డు పాయింట్లు కోల్పోయినట్లే. మరో క్రెడిట్ కార్డు తీసుకోవాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి సమస్య లేకుండా ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సరికొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డును ఇటీవల తీసుకొచ్చింది. ఇందులో ఓ అద్భుతమైన ఆఫర్ ను పెట్టింది. ఇందులో రివార్డు ప్రోగ్రామ్‌ను మీరే కస్టమైజ్ చేసుకోవచ్చట. ఐదు రకాల కేటగిరీల్లో ఏదైనా రెండింటిని ఈ కార్డు యూజర్లు ఎంచుకోవచ్చు. వాటిపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి ఆయా కేటగిరీలను మార్చుకోవచ్చుట. ఎలాంటి ఛార్జిలు కూడా వర్తించవు. హెచ్‌డీఎఫ్‌సీ చెందిన పేజ్ యాప్‌లో మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించింది బ్యాంక్.
READ MORE: Bank FD: సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులేవో తెలుసా?
Also Read
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
వివిధ కేటగిరీలు.. డైనింగ్, ఎంటర్‌టైన్మెంట్- బుక్ మై షే, జొమాటో- ట్రావెల్- మేక్ మై ట్రిప్, ఉబర్ – గ్రాసరీ- బ్లింకిట్, రిలయన్స్ స్మార్ట్ బజార్ – ఎలక్ట్రానిక్స్- క్రోమా, రిలయన్స్ డిజిటల్ – ఫ్యాషన్- నైకా, మింత్రా ఇలా ఉన్నాయి. ఈ కేటగిరీల్లో ఏవైనా రెండింటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటిపై ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ వేదికలపై 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుంటే 3 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ కార్డు జాయినింగ్ ఫీ రూ.500 గా ఉంది. కార్డు తీసుకున్న 90 రోజుల్లో రూ.20 వేలు ఖర్చు చేస్తే ఫీ రద్దవుతుంది. ఏడాదిలో రూ.1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీ చెల్లంచాల్సిన అవసరం లేదు. రివార్డుల రూపంలో వచ్చిన క్యాష్ పాయింట్లు పేజ్ యాప్ వాలెట్‌లో జమ అవుతుంది. యాప్‌లోనే రిడీమ్ చేసుకోవచ్చు. ఈ కార్డు కావాలంటే మీరు పేజ్ యాప్‌లో దరకాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!