Site icon NTV Telugu

HCU- ABVP : హెచ్సీయూ వద్ద టెన్షన్ వాతావరణం.. యూనివర్సిటీ బంద్‌కు ఏబీవీపీ పిలుపు..

Abvp

Abvp

హెచ్సీయూ భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది.. నిరసనలు ఉద్ధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది.. ఉదయం 10.30 కు హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు ఏబీవీపీ యత్నిస్తోంది. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం ఈ రోజు వర్సీటీకి వెళ్లనున్నారు. బీజేపీ హెచ్సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తోంది. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. హెచ్సీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

READ MORE: Exclusive: యంగ్ హీరోలు మారాల్సిందే.. లేదంటే భారీ మూల్యం తప్పదు

ఈ అంశంపై తాజాగా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ మాట్లాడారు. “హెచ్‌సీయూలో భూముల అమ్మకాన్ని విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. జీవవైవిద్యాన్ని కాపాడాలని అంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దాష్టికంగా వ్యవహరించారు. కంచెలు తొలగించామన్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి నిర్బంధ పాలన కొనసాగిస్తుంది. వాస్తవాలు తెలుసుకునేందుకు హెచ్‌సీయూకి వెళ్తామంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వం వెంటనే హెచ్సియు భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.” అని ఆయన పేర్కొన్నారు.

READ MORE: Visakha Mayor: గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాసం కోసం కౌంట్డౌన్..

Exit mobile version