NTV Telugu Site icon

Ayodhya: రామ మందిరంలో ప్రతిష్టించడానికి ఎంపిక చేయని మరో విగ్రహాన్ని చూశారా..?

Ram Idol

Ram Idol

అయోధ్యలో ఎన్నో శతాబ్దాల పోరాటం.. నిరీక్షణ తర్వాత రామ్ లల్లా విగ్రహం సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రతిష్టించబడింది. కాగా.. అంతకుముందు రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసే పనిని ముగ్గురు శిల్పులకు అప్పగించింది ఆలయ ట్రస్ట్. అయితే రామమందిరంలో ప్రతిష్టబోయే ముందు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే ఎంపిక కానటువంటి రాంలల్లా విగ్రహం ఆలయంలో ప్రతిష్టించలేకపోయినప్పటికీ, ఆలయ ట్రస్ట్ ఆ విగ్రహం ఎలా ఉందో చూపించారు.

Read Also: Tragedy: మహారాష్ట్రలో విషాదం.. పడవ బోల్తా పడి ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు

ఈ విగ్రహాన్ని జైపూర్ కు చెందిన సత్యనారాయణ పాండే అనే శిల్పి చెక్కాడు. అతను కొన్ని సంవత్సరాలుగా శిల్పకళా పని చేస్తున్నాడు. కాగా.. రామమందిరంలో ప్రతిష్టించాలనుకున్న ఈ విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తయారు చేశాడు. ఈ విగ్రహం ప్రస్తుతం ఆలయ ట్రస్ట్ వద్ద ఉంది.. ఈ విగ్రహాన్ని వారి వద్ద మాత్రమే ఉంచుకుంటారు.

Read Also: Payyavula Keshav: ఆయన పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు.. టీడీపీ కౌంటర్ ఎటాక్

శతాబ్దాల వివాదాల తర్వాత.. 2019లో సుప్రీంకోర్టు రామమందిరానికి అనుకూలంగా తీర్పునిచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయానికి శంకుస్థాపన చేశారు. కాగా, జనవరి 22 సోమవారం రామమందిరంలో రామ్ లల్లాను ప్రతిష్టాపన జరిగింది. అయితే ఈరోజు నుంచి సాధారణ భక్తులకు బాలరాముడు దర్శనమిస్తున్నాడు.