NTV Telugu Site icon

Hash Oil: హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ సీజ్..

Yash Oil

Yash Oil

హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నార పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ (TSNAB) అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ.. గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు. చిన్న చిన్న బాటిల్స్‌లో హాష్ ఆయిల్‌ను పోలీసులు గుర్తించారు. విక్రయానికి రెడీగా ఉన్న హాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. దీంతో పాటు.. లేడి కిలాడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Maharashtra Polls: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన సీనియర్‌ నేత రవి రాజా

NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారం క్రితం లేడీ కిలాడి కొడుకును హాష్ ఆయిల్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఎస్వోటీ అధికారులు. భారీగా హాష్ ఆయిల్‌ను స్వాధీనపరుచుకున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతనిని జైల్‌కు తరలించారు. తాజాగా.. ఈ రోజు అతని తల్లిని పట్టుకున్నారు అధికారులు. ఆమె వద్ద నుంచి హాష్ ఆయిల్, 35 వేల నగదు స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు.

Read Also: Stock Market: దీపావళి రోజున నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

మరోవైపు.. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ హోటల్ వద్ద గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో.. మూడు లీటర్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎస్వోటీ పోలీసులు బాలానగర్ పోలీసులకు అప్పగించారు.