Hash Oil: హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ సీజ్..
- హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం
- బాలానగర్ సామ్రాట్ హోటల్ వద్ద 3 లీటర్ల హాష్ ఆయిల్ సీజ్
- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రాజేంద్రనగర్‌లో 300 ఎంఎల్ హాష్ ఆయిల్ అమ్ముతున్న మహిళ అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నార పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ (TSNAB) అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ.. గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు. చిన్న చిన్న బాటిల్స్‌లో హాష్ ఆయిల్‌ను పోలీసులు గుర్తించారు. విక్రయానికి రెడీగా ఉన్న హాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. దీంతో పాటు.. లేడి కిలాడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Maharashtra Polls: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన సీనియర్ నేత రవి రాజా
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారం క్రితం లేడీ కిలాడి కొడుకును హాష్ ఆయిల్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఎస్వోటీ అధికారులు. భారీగా హాష్ ఆయిల్‌ను స్వాధీనపరుచుకున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతనిని జైల్‌కు తరలించారు. తాజాగా.. ఈ రోజు అతని తల్లిని పట్టుకున్నారు అధికారులు. ఆమె వద్ద నుంచి హాష్ ఆయిల్, 35 వేల నగదు స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు.
Read Also: Stock Market: దీపావళి రోజున నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
మరోవైపు.. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ హోటల్ వద్ద గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో.. మూడు లీటర్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎస్వోటీ పోలీసులు బాలానగర్ పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి