Harom Hara: నటుడు సుధీర్ బాబు టాలీవుడ్ ‘నవదళపతి’గా నామకరణం పొంది నటించిన చిత్రం ‘హరోం హర’. సుధీర్ బాబు సినీ కేరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా హరోం హర నిలిచింది. ఎన్నోఅంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. కానీ, సుధీర్ బాబు గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్ లో, చిత్తూరు యాసలో ప్రేక్షకులను నుండి ప్రశంసలు పొందాడు. ఈ చిత్ర కథ, కధనం ఆద్యంతం కుప్పం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసింది.
Read Also: Kalki 2898 AD: రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు… కల్కి కలెక్షన్స్ ఎంతంటే ..?
హరోం హర డిజిటల్ మరియు శాటిలైట్ పెండింగ్ రైట్స్ పెండింగ్ లో ఉన్నాయి. థియేట్రికల్ రన్ ముగియడంతో పలు OTT సంస్థలు ఈ చిత్ర రైట్స్ కోసం రేసులో నిలిచాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. హరోం హర నాన్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ నెట్ వర్క్ సొంతం చేసుకున్నట్లు యూనిట్ వర్గాల నుండి సమాచారం. నిర్మాణ సంస్థ ఊహించినదానికంటే ఎక్కువ ధరకు ఈటీవీ నెట్ వర్క్ కోట్ చేసినట్టు వినిపిస్తోంది. సుధీర్ బాబు సూపర్ హిట్ ఫిల్మ్ సమ్మోహనం చిత్రాన్ని కూడా ఈటీవి నెట్ వర్క్ కొనుగోలు చేసింది. ఆ చిత్రానికి ఈటీవీ విన్ లో మంచి ఆదరణ లభించడంతో హరోంహర కంటెంట్ పై నమ్మకంతో అధిక ధరకు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసిన ట్టుతెలుస్తోంది.
Read Also: Kalki 2898 AD: రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు… కల్కి కలెక్షన్స్ ఎంతంటే ..?
మరికొద్ది రోజుల్లో ఈటీవీ విన్ లో డిజిటల్ ప్రీమియర్ గా హరోం హర ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ కథానాయికగా నటించడం జరిగింది. ఈ చిత్రంకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.