Harmanpreet Kaur: రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అందుకున్న టీమిండియా కెప్టెన్.!
- దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’
- రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మశ్రీ' అందుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్
- 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur: భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా సోమవారం నాడు జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో అందుకున్నారు. ఈ ఏడాది జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 131 మంది పద్మ పురస్కార గ్రహీతల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కూడా ఉంది. భారత మహిళల క్రికెట్ విజయాలకు ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది.
ముఖ్యంగా 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత్ తొలిసారి మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్ కొత్త శకానికి నాంది పలికింది. 36 ఏళ్ల హర్మన్ ప్రీత్ కు ఇది ఐదవ వన్డే ప్రపంచకప్. గతంలో పలుమార్లు నిరాశ ఎదురైనా, ఈసారి మాత్రం తన నాయకత్వంతో జట్టును విజేతగా నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయింది.
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
పద్మశ్రీ అవార్డు జాబితాలో తన పేరు ఉండటంపై హర్మన్‌ప్రీత్ ఆనందం వ్యక్తం చేసింది. “రాష్ట్రపతి భవన్ నుంచి మా నాన్నకు కాల్ వచ్చింది. ఈ ఏడాది నాకు పద్మశ్రీ అవార్డు వస్తోందని తెలిసింది. ఇది నా జీవితంలో ఎంతో గొప్ప క్షణం. నా కంటే ముందుగా ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిసినందుకు ఇంకా ఆనందంగా ఉంది” అని ఆమె అన్నారు. అలాగే పద్మ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్న భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఆమె అభినందనలు తెలిపింది. రోహిత్ చాలా కష్టపడి పనిచేశాడు. అతనికి కూడా ఈ గౌరవం రావడం ఎంతో ఆనందంగా ఉందని హర్మన్ ప్రీత్ అన్నారు.
#WATCH | Delhi | President Droupadi Murmu confers Padma Shri on India women's cricket captain Harmanpreet Kaur for her contributions in the field of Sports (Cricket)
(Video source: President of India/Social Media) pic.twitter.com/Rua8xCLznp
— ANI (@ANI) May 25, 2026
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!