దళితులపై చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మాది: మంత్రి హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళితులపై చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మాదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధుపై కాంగ్రెస్, బీజేపీ అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. దళితులపై బీజేపీ ప్రేమ కల్లబొల్లి మాటల్లోనే తప్ప చేతల్లో చేసిందేమి లేదని హరీష్ రావు అన్నారు. దళిత బంధు వంటి పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని.. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేలా పథకాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో దళితులకు ఎక్కువ నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు హరీష్ రావు. కేంద్రం గత బడ్జెట్లో దళితుల సంక్షేమం కోసం రూ. 1.26 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 20.14 కోట్ల మందికి సగటున కేవలం రూ. 6 వేలు మాత్రమే వచ్చాయన్నారు.
Read Also: కాళేశ్వరం ప్రాజెక్టుకు అరుదైన గుర్తింపు
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ఇదే తెలంగాణ దళిత కుటుంబాలపై సగటున రూ.35 వేలు ఖర్చు చేస్తుందన్నారు. బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారని.. వారు కేంద్రంతో పోరాడి దళితుల అభివృద్ధికి నిధులు తీసుకురావాలని కోరారు. గత పదేళ్లలో కాంగ్రెస్ తెలంగాణలో దళితులకు ఖర్చు చేసిన నిధుల కన్నా గత ఏడున్నర ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసిదని హరీష్ రావు తెలిపారు. ఈవిషయం గురించి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రంలో 134 ఎస్సీ గురుకులాలు ఉంటే.. ప్రస్తుతం 268 ఎస్సీ గురుకులాలు తీసుకువచ్చామన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తుందని.. ప్రైవేటు పరం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయడంతో దళితులు రిజర్వేషన్లు కోల్పోతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలను సీఎం కేసీఆర్ కాపాడుతున్నారన్నారు.
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!