Site icon NTV Telugu

Harish Rao: గోదావరి జలాలపై అన్యాయం జరుగుతే ఊరుకోం.!

Harish Rao

Harish Rao

Harish Rao: తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రం, ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సాధించిన పార్టీగా తమకు రాజకీయాల కంటే ముందుగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పేర్లు మారుతున్నాయే తప్ప, గోదావరి జల ద్రోహం మాత్రం ఆగలేదని హరీష్ రావు అన్నారు. బనకచర్ల నుంచి నల్లమల సాగర్ వరకు పేర్లు మారినా దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. “కత్తి చంద్రబాబు చేతిలో ఉంది.. పొడిచేది రేవంత్ రెడ్డి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బనకచర్లపై సమావేశానికి వెళ్లబోమని చెప్పి వెళ్లారని, ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందని అన్నారు.

Ragi Sangati Recipe: షుగర్, వెయిట్ కంట్రోల్‌ చేసి ఉక్కులాంటి బలం అందించే రాయలసీమ రాగి సంగటి ఇలా చేసేయండి.!

ఆంధ్రప్రదేశ్ ఒత్తిడి వల్లే ఈరోజు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు నష్టం చేసే ఈ సమావేశానికి ఎందుకు హాజరవుతున్నారు? అంటూ ప్రశ్నించారు. గతంలో తాను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తేదీలు మార్చి ఉత్తరాలు రాసిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కుంభకర్ణుడిలా మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. తెలంగాణ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆదిత్య నాథ్ దాస్ గతంలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఎలా తెలంగాణ తరఫున సమావేశానికి నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో మరో ఇరిగేషన్ అధికారి దొరకలేదా అంటూ మంది పడ్డారు. ఈ విషయాన్ని “దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా ఉంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ నీటి హక్కులను మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో జరగబోయే సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళితే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మాట్లాడాలని కోరారు.

Moto Signature Flipkart: మోటో సిగ్నేచర్ సేల్స్ ప్రారంభం.. 50+50+50MP కెమెరాలు, 5200mah కార్బన్‌ బ్యాటరీ!

ఇంకా “కేసీఆర్ నీటిని ఒడిసి పట్టుకుంటే.. రేవంత్ రెడ్డి నీటిని ఏపీకి జారవిడుస్తున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని తక్షణమే రిపేర్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Exit mobile version