Jagga Reddy : మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ సీనియార్ నాయకులు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హరీష్ నువ్వు బయట చాలా బిరుదులు తెచ్చుకున్నావని, ఒకడు ట్రబుల్ షూటర్ అంటారని, ఇంత పరిజ్ఞానం ఉన్న నువ్వు.. చిన్న లాజిక్ మర్చిపోయావన్నారు జగ్గారెడ్డి. గల్లీ నుండి ఢిల్లీ రాజకీయం వరకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనా? బీజేపీ పుట్టకముందే RSS ఉన్నది, అయితే ఈ రెండు పార్టీలు రాజకీయ అవగాహన కలిగి ఉంటాయా? అని హరీష్ రావుపై విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందా? మతం మీద రాజకీయాలు చేసే బీజేపీని చూసి, అన్ని మతాలు సమానం అనేవి కాంగ్రెస్ ఎందుకు చెబుతోంది? అని ఆయన ప్రశ్నించారు జగ్గారెడ్డి.
STR : సెట్స్ పై అరడజను సినిమాలు.. డిస్కషన్స్ లో మరో రెండు
ఇంకా, హరీష్ రావు రాజకీయాలలో ఎక్కువ భాగం యాక్టింగ్ మీద ఆధారపడి ఉంటారని జగ్గారెడ్డి అన్నారు. మీ అంత యాక్టింగ్ మాకు రాదని, ఇంజనీరు, మీరే, మేస్త్రి, మీరే అని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీమీదే మీరు ఆధారపడి పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. SLBC, SRSP వంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు ఇలాంటి యాక్టింగ్ చేయలేదని, మీరు కాళేశ్వరం దగ్గర మంచం వేసుకుని, మస్తు యాక్టింగ్ చేసారు అని జగ్గారెడ్డి విమర్శించారు. మీరు చేసిన తప్పులు, ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారని, మీరు చేసే పనులలో ఒక తేడా లేకుండా, జనాలు అంగీకరించడానికి మీరు మళ్లీ ప్రయత్నిస్తున్నారు అని జగ్గారెడ్డి ఆరోపించారు.
Simhachalam Tragedy: విశాఖ వెళ్లనున్న వైఎస్.జగన్.. బాధిత కుటుంబాలకు పరామర్శ
