Site icon NTV Telugu

Harish Rao : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరి బ్రతుకులు రోడ్డున పడ్డాయి

Harish Rao

Harish Rao

Harish Rao : హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంపీ, పీఎంపీల మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు భారీగా ఆర్ఎంపీ, పీఎంపీలు తరలివచ్చారు. అయితే.. వారి ధర్నాకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భయబ్రాంతులకు గురిచేసి , అక్రమ కేసులు పెడుతున్నారని, మేనిఫెస్టోలో ట్రైనింగ్ ఇచ్చి , సర్టిఫికెట్ ఇస్తామన్నారన్నారు హరీష్‌ రావు. ఇప్పుడు రోడ్లపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై ఆరోగ్యశాఖ అధికారుల వేధింపులను ఆపాలని ఆయన అన్నారు.

Bangladesh: “ఆపరేషన్ డెవిల్ హంట్‌” తో షేక్ హసీనా మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తున్న యూనస్ సర్కార్..

ముఖ్యమంత్రి , ఆరోగ్యశాఖ మంత్రి స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరి బ్రతుకులు రోడ్డున పడ్డాయని, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు… రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదన్నారు. దీనిపై చర్చకు ఏ గ్రామనికైనా రావడానికి సిద్ధమని ఆయన అన్నారు. గతంలో తాము ఇచ్చిన పథకాలను వానాకాలం రైతు బంధు , బతుకమ్మ చీరలు , ఫీజు రియంబర్స్ మెంట్ , కేసీఆర్ కిట్ , వృద్ధుల రెండు నెలల పెన్షన్ ఎగరగొట్టి రుణమాఫీ కు నిధులు మళ్లించారని హరీష్‌ రావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఆర్ఎంపీలు చురక పెట్టాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కు మించిన ఆయుధం లేదు… కాంగ్రెస్ ప్రభుత్వానికి దానితో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలన్నారు.

Smartphone: రూ.10 వేల బడ్జెట్‌లో Redmi 14C 5G Vs Realme C63 5Gలో ఏ ఫోన్ బెటర్?

Exit mobile version