Harish Rao : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు నిధుల పంపిణీ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. గత 16 నెలలుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు అందకుండా ఉండటాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు.
Ukraine Russia War: ఉక్రెయిన్ బంపర్ ఆఫర్.. రష్యన్ డ్రోన్‌లను కూల్చేస్తే నెలకు రూ. 2 లక్షలు
ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యాలయాలకు చెందిన ట్రాక్టర్లను నడిపేందుకు డీజిల్ ఖర్చులూ లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు వాటి తాళాలను ఉన్నతాధికారులకు అప్పగిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని ఎక్స్ (ఇటీవల ట్విటర్ గా పేరొందిన ప్లాట్‌ఫార్మ్) వేదికగా ప్రస్తావించిన హరీశ్ రావు, “కాంగ్రెస్ పార్టీ చెప్పిన మార్పు ఇదేనా రేవంత్ రెడ్డి గారు? ఇది మార్పు కాదు, ఏ మార్పూ కాదు” అంటూ ఎద్దేవా చేశారు.
