Harish Rao : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు నిధుల పంపిణీ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. గత 16 నెలలుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు అందకుండా ఉండటాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. Ukraine Russia War: ఉక్రెయిన్ బంపర్ ఆఫర్.. రష్యన్ డ్రోన్‌లను కూల్చేస్తే నెలకు రూ. 2…
Funds Release: గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే రూ.153 కోట్లు విడుదల చేస్తూ 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ విడతలో చెల్లించడం గమనార్హం. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు నడుం బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయితీలకు అందించే నిధుల విషయంలో కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.250 ఇచ్చేదని.. గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేదని పవన్ తెలిపారు.
ఏపీలో నిధుల కోసం సర్పంచులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ఏపీ బీజేపీ మద్దతు ఇచ్చింది. సర్పంచ్‌ల హక్కుల సాధన కోసం పోరుబాట పడుతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయనుంది.