Site icon NTV Telugu

Harish Rao: మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు..

Siddipet Mla Harish Rao

Siddipet Mla Harish Rao

సిద్ధిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చలికాలంలో విద్యార్థులు వేడినీళ్లు రాక, దుప్పటి రాక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదు అని అన్నారు కానీ.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని హరీష్ రావు విమర్శించారు.

Read Also: Borewell Incident: 6 రోజులుగా బోరు బావిలోనే మూడేళ్ల బాలిక.. కాపాడాలని వేడుకుంటున్న తల్లి..

పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారా.. ప్రభుత్వం ఫెయిల్ అనిపిస్తుందని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదు.. ముఖ్యమంత్రి మాటలు అధికారులు వినడం లేదా లేక ముఖ్యమంత్రి ఊరికే చెప్పానని అధికారులకు చెబుతున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా విలువ లేదా అని విమర్శించారు. తక్షణమే అన్ని చోట్ల మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు రివ్యూ చేయడం లేదని అన్నారు. ఢిల్లీ పైసలు ఇచ్చినా.. గల్లీ విడుదల చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు.

Read Also: Pawan Kalyan: “ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో మీకు తెలియదు”.. అభిమానులపై పవన్ ఫైర్ (వీడియో)

Exit mobile version