NTV Telugu Site icon

Harish Rao: గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది..

Harish Rao

Harish Rao

మాజీ మంత్రి, బీర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు వచ్చినా విడుదల చేయట్లేదని అన్నారు. గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్లు ఆగమయ్యాం అని తనకు వినతిపత్రం ఇస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం తట్టిలేపితే కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోయట్లేదని అన్నారు.

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక..

ఉపాధి హామీ నిధులు కేంద్రం రూ. 850 కోట్లు నిధులు విడుదల చేసింది.. రూ. 350 కోట్ల గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవ్వాలి.. అవి విడుదల చేయడం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. చాలా చోట్ల బిల్లులు రాలేదని స్కూళ్లలో బాత్రూంలు ఓపెన్ చేయట్లేదని తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోవడంతో చాలా నిధులు ఆగిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యపై అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని.. తాను లేవగానే 8 మంది మంత్రులు లేచి అడ్డుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. రైతు రుణమాఫీపై రేషన్ కార్డు నిబంధనలు లేదు అన్నారు.. కానీ జీవో ఇవ్వలేదని హరీష్ రావు పేర్కొన్నారు. దీనితో రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ జరగలేదని తెలిపారు. PMKSY, రేషన్ కార్డు నిబంధనల వల్ల నలభై శాతం వారికి రుణమాఫీ అవ్వట్లేదని అన్నారు.

Michael Vaughan: విరాట్, కేన్ వల్ల కాదు.. సచిన్‌ టెస్టు స్కోరును అధిగమించేది అతడే!

అసెంబ్లీ ముందు నాలుగు వరుసల కంచెలు వచ్చాయి.. గతంలో జీఎచ్ఎంసీ కార్పొరేటర్కు నెలకు నలభై లక్షల ఫండ్స్ ఇచ్చే వాళ్ళమన్నారు. ఇప్పుడు ఒక్క పైసా కార్పొరేటర్ ఇవ్వట్లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీహార్ ఆఫీసర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని గగ్గోలు పెట్టారు.. మరి ఇప్పుడు తెలంగాణ నుంచి ఉన్న సీవీ ఆనంద్, శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, శివదర్ రెడ్డిలకు అర్హత ఉన్నా వాళ్ళను ఎందుకు డీజీపీ చేయలేదని ప్రశ్నించారు. గతంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చే..సి ఇప్పుడు అందలం ఎక్కించారని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. దివ్యాంగులు ఐఏఎస్లుగా పనికిరారు అనే స్మిత సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదన్నారు హరీష్ రావు. ఇకపోతే.. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అయ్యే విషయంలో తమకు ఒక స్ట్రాటజీ ఉంది.. హాజరు అవుతారో లేదో ఇప్పుడే చెప్పమని హరీష్ రావు చెప్పారు.

Show comments