PM Modi: నేహ మర్డర్‌పై స్పందించిన ప్రధాని.. ఓట్ బ్యాంక్ రాజకీయాలని కాంగ్రెస్‌పై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇటీవల కర్ణాటకలోని హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్(22) కాలేజ్ క్యాంపస్‌లో దారుణహత్యకు గురైంది. ఫయాజ్ అనే నిందితుడు కత్తితో పలుమార్లు దాడి చేసి హత్య చేశాడు. ఈ హత్య కర్ణాటకలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఈ హత్య జరిగిందని బీజేపీ ఆరోపించింది. అంతేకాకుండా ఈ కేసులో లవ్ జిహాద్ కోణం ఉందని ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ మాత్రం ఇది వ్యక్తిగత విషయాల వల్ల జరిగిందని, దీంట్లో లవ్ జిహాద్ కోణం లేదని చెప్పింది.
Read Also: Prajwal Revanna: మాజీ ప్రధాని మనవడిపై లైంగిక వేధింపుల కేసు.. దుమారం రేపుతున్న అసభ్యకర వీడియోలు..
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఇదిలా ఉంటే, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ నేహా హత్యపై స్పందించారు. ‘‘రాష్ట్రంలో ఓ కూతురికి ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందింది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళకరంగా ఉంది. కుమార్తెలు ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ చేసిన పాపాల వల్లే ఓ కాలేజ్ క్యాంపస్‌లో ఎవరినైనా హత్య చేసే దమ్ము, ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే వచ్చాయని, తమను కొద్దిరోజుల్లో రక్షిస్తారని వారికి తెలుసు’’ అని మోడీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉందని, నేరాలను నియంత్రించడానికి బదులు, కాంగ్రెస్ దేశవ్యతిరేక ఆలోచన ధోరణిని ప్రోత్సహిస్తోందని ప్రధాని ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్ని కాంగ్రెస్ బహిష్కరించడాన్ని ప్రధాని దుయ్యబట్టారు. ఓటు బ్యాంక్ ఆకలితో ఉన్నవారు రామ మందిర ఆహ్మానాన్ని తిరస్కరించారు. మరోవైపు అన్సారీ కుటుంబం మూడు దశాబ్దాలుగా రామాలయం కేసుపై పోరాడింది, సుప్రీంకోర్టు తర్వాత ఆయనను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తే, అతను కూడా ప్రాణప్రతిష్టకు హాజరయ్యారని ప్రధాని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..