Site icon NTV Telugu

Harish Rao: బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటే మియా.. రెండు అబద్దాల పార్టీలే..

Harish Rao

Harish Rao

Harish Rao: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం పదేళ్ళపాటు అధికారంలో ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కాలేదు.. అప్పుడే వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.. ప్రజలకిచ్చిన హామీలు అమలు చెయ్యలేదని ఆయన అన్నారు. మళ్ళీ తెలంగాణలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని హరీష్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి అయ్యాయని ఆయన ఆరోపించారు.

Read Also: BRS: కడియంకు చెక్‌ పెట్టేందుకేనా?.. వరంగల్‌ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య!

మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, సికింద్రాబాద్‌లలో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదని.. అందుకే లీకులు, ఫేకులు చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే ఇంకా నష్టపోతామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ బడేమియా, కాంగ్రెస్ చోటే మియా.. రెండు అబద్దాల పార్టీలేనని ఆయన ఆరోపించారు. పులివెందుల అంటే వైఎస్సార్, కుప్పం అంటే చంద్రబాబు, సిద్దిపేట అంటే కేసీఆర్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

 

 

Exit mobile version