NTV Telugu Site icon

Harish Rao : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్సే

Harish Rao

Harish Rao

గజ్వేల్‌లో మంత్రి హరీష్‌ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్సే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు గంటల కరెంట్ చాలు అంటున్న కాంగ్రెస్ ను ఓడించాలని, బీజేపీ, కాంగ్రెస్ కు ఓటు వేసి రిస్క్ తీసుకోవద్దన్నారు. అవసరానికి వచ్చి కొందరు వరుసలు కలుపుతున్నారని, బీజేపీ వాళ్ళకి ఓటు వేస్తే మురిగి పోయినట్టేనన్నారు. కేసీఆర్ ను తిప్పలు పెట్టేందుకు నొట్ల కట్టలు తెచ్చి పంచుతారట.. 14 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మిగిలిన మరో 4 వేల కోట్లు ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే వారంలో వేస్తామన్నారు హరీష్‌ రావు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. 2009 లో పెట్టిన మేనిఫెస్టో లో పెట్టిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదని, ఈ రోజు కాంగ్రెస్ 42 పేజీల మేనిఫెస్టోని ప్రవేశపెట్టిందన్నారు మంత్రి హరీష్‌ రావు.

Also Read : Perfume Movie: స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌‌తో ‘పర్‌ఫ్యూమ్’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌

అంతేకాకుండా.. ‘అది మేనిఫెస్టో కాదు..420 మేనిఫెస్టో. 2009 లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అరచేతిలో వైకుంఠం చూపిస్తే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు. ఆచరణలో సాధ్యం కాని విదంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది. ఎలాగో అధికారంలోకి వచ్చేది లేదని ఇష్టం వచ్చినన్ని పేజీల మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలుకావడం లేదు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ని కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టింది. ధరణి పేరు మార్చి భూమాత అని పెట్టారు. రైతు బంధు, కళ్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ లాంటి పథకాలు కాపీ కొట్టారు. తెలంగాణ అప్పుల పాలయ్యిందని ఈటల రాజేందర్ చెబుతున్నాడు. సంతకం పెట్టి అప్పుడు అప్పులు ఆర్థిక మంత్రిగా తెచ్చింది నువ్వే కదా ఈటెల రాజేందర్. అప్పుడు కేసీఆర్ మంచోడు అన్నవ్. గొప్పొడు అన్నవ్. పార్టీ మారంగనే మాట మార్చావ్. గజ్వేల్ అభివ్రుది చెందినట్టు.. హుజురాబాద్ చేసావా.. ఓట్ల కోసం జూటా మాటలు మాట్లాడుతున్నావ్. అన్నం పెట్టిన కేసీఆర్ ను మోసం చేసింది నువ్వు, సున్నం పెట్టింది నువ్వు.’ అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు.

Also Read : Malreddy Rangareddy: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలుచేసి తీరుతాం..