Harish Rao : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్సే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గజ్వేల్‌లో మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్సే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు గంటల కరెంట్ చాలు అంటున్న కాంగ్రెస్ ను ఓడించాలని, బీజేపీ, కాంగ్రెస్ కు ఓటు వేసి రిస్క్ తీసుకోవద్దన్నారు. అవసరానికి వచ్చి కొందరు వరుసలు కలుపుతున్నారని, బీజేపీ వాళ్ళకి ఓటు వేస్తే మురిగి పోయినట్టేనన్నారు. కేసీఆర్ ను తిప్పలు పెట్టేందుకు నొట్ల కట్టలు తెచ్చి పంచుతారట.. 14 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మిగిలిన మరో 4 వేల కోట్లు ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే వారంలో వేస్తామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. 2009 లో పెట్టిన మేనిఫెస్టో లో పెట్టిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదని, ఈ రోజు కాంగ్రెస్ 42 పేజీల మేనిఫెస్టోని ప్రవేశపెట్టిందన్నారు మంత్రి హరీష్ రావు.
Also Read : Perfume Movie: స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ‘పర్‌ఫ్యూమ్’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
అంతేకాకుండా.. ‘అది మేనిఫెస్టో కాదు..420 మేనిఫెస్టో. 2009 లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అరచేతిలో వైకుంఠం చూపిస్తే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు. ఆచరణలో సాధ్యం కాని విదంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది. ఎలాగో అధికారంలోకి వచ్చేది లేదని ఇష్టం వచ్చినన్ని పేజీల మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలుకావడం లేదు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ని కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టింది. ధరణి పేరు మార్చి భూమాత అని పెట్టారు. రైతు బంధు, కళ్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ లాంటి పథకాలు కాపీ కొట్టారు. తెలంగాణ అప్పుల పాలయ్యిందని ఈటల రాజేందర్ చెబుతున్నాడు. సంతకం పెట్టి అప్పుడు అప్పులు ఆర్థిక మంత్రిగా తెచ్చింది నువ్వే కదా ఈటెల రాజేందర్. అప్పుడు కేసీఆర్ మంచోడు అన్నవ్. గొప్పొడు అన్నవ్. పార్టీ మారంగనే మాట మార్చావ్. గజ్వేల్ అభివ్రుది చెందినట్టు.. హుజురాబాద్ చేసావా.. ఓట్ల కోసం జూటా మాటలు మాట్లాడుతున్నావ్. అన్నం పెట్టిన కేసీఆర్ ను మోసం చేసింది నువ్వు, సున్నం పెట్టింది నువ్వు.’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Also Read : Malreddy Rangareddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలుచేసి తీరుతాం..
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!