Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్.. దానిపై చర్చకు సిద్ధమా..!
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది
- రైతులను ముంచింది కాక సీఎం రేవంత్ సంబరాలు చేయమంటున్నారు
- ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నేరవేర్చినా సీఎం రేవంత్‌రెడ్డితో నేను చర్చకు సిద్ధం
- కౌలు రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారు :హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట్ట ముంచిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ముంచింది కాక సిగ్గులేకుండా సంబరాలు చేయమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన నేను బహిరంగ చర్చకు సిద్ధమని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు రైతులకు అమాలయ్యాయా..? అని ఆయన వ్యాఖ్యానించారు. 15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి 12 వేలు ఇస్తున్నారని, వానాకాలం గుండు సున్నా ఇచ్చి యాసంగిలో కోతలు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో వస్తే 15 వేల హామీ ఏమైంది అని నిలదీయండని, మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకే పంటకు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు హరీష్ రావు. కౌలు రైతులకు ఇచ్చిన హామీ ఏమైందో రేవంత్ కే తెలియాలన్నారు. వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామన్న సీఎం రేవంత్ ఇప్పుడు కేవలం 10 లక్షల మందికే ఇస్తాం అంటున్నారని, మన రాష్ట్రంలో ఒక కోటి 2 లక్షల మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికి ఇస్తే ఇదేం నీతి..? అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలప్పుడు మాటల కోటలు ఎన్నికలు అయిపోయాక కోతలు అని ఆయన మండిపడ్డారు. ఓ ఎకరం భూమి ఉన్న రైతులను వ్యవసాయ కూలీలుగా గుర్తించి 12 వేలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామని, వ్యవసాయ కూలీలను గుర్తించేటప్పుడు కనీసం సోయి ఉండాలి కదా..? బుద్ది ఉందా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరం లోపు భూమి ఉన్న వారిని రైతులుగా గుర్తిస్తే వాళ్ళు నష్టపోతారని ఆయన అన్నారు. రుణమాఫీ అయిపోయింది 20 వేల కోట్లు చేశాం అంటున్నారని, కానీ ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. లక్ష లోపు, రెండు లక్షల పైన ఉన్న రుణాలు కూడా రుణమాఫీ కాలేదని, సీఎం చెప్పిన ఆగస్టు 15 గడువు ఐపాయే… కొత్త సంవత్సరం వచ్చింది మళ్ళీ ఇంకో ఆగస్టు 15 వస్తుందన్నారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
Drugs Mafia: రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను కొలిమిలో తగలబెట్టిన పోలీసులు.. ఎందుకంటే?
నేను రైతుల గురించి మాట్లాడితే చిల్లర గాళ్లతో నన్ను సీఎం రేవంత్ తిట్టిస్తారని, నా ఇంటికి గుండాలను పంపుతారని, పంటల బీమా పథకం అటకెక్కింది…పంటకు బోనస్ అని మోసం చేశారన్నారు. 2023-24 సంవత్సరానికి 15 వేలు ఇవ్వాల్సిన రైతు భరోసా 6 వేలే ఇస్తాం అంటున్నారని, తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ పార్టీని రైతులు తిడుతున్నారన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ హింసా రాజకీయాలు ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ పై, కౌశిక్ రెడ్డి పై, నా ఆఫీస్ పై, అల్లు అర్జున్ ఇంటిపై, BRS ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని, నిన్న యాదాద్రి లో BRS పార్టీ కార్యాలయంపై పోలీసులే దగ్గరుండి దాడులు చేయించినట్టు వీడియోలు ఉన్నాయన్నారు హరీష్ రావు.
హోంమంత్రి గా సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారని, ఆయన మోసంతో దాడుల వెనుక ఆయన హస్తం ఉందని ప్రజలకి అనుమానం కలుగుతోందన్నారు. ప్రజా పాలన కేవలం పేపర్ పై ఉంది ప్రతీకార పాలన రాష్ట్రంలో నడుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ఠలా మార్చేశారని, ఆరు గ్యారెంటీల గురించి అడిగితే మాపై దాడులు చేయిస్తారా..? అని హరీష్ రావు ఫైర్ అన్నారు. పోలీసులను ప్రతిపక్షం చుట్టే తిప్పడం వల్ల తెలంగాణలో 23 శాతం క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. సీఎం రేవంత్ ఈ హింస రాజకీయాలు వెంటనే ఆపాలి..కాంగ్రెస్ గుండాలను అదుపులో పెట్టుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కూడా దాడులపై జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Jyothula Nehru: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!