NTV Telugu Site icon

Harish Rao: కేసీఆర్‌పై మంత్రులు చేసిన వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్

Harish Rao

Harish Rao

Harish Rao: కేసీఆర్‌పై కాంగ్రెస్ మంత్రులు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌పై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే మంత్రులు ఆయనను తిడుతున్నారని.. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అంటున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిగ్గు ఉందా..రాహుల్ గాంధీ ఏమో తన మేనిఫెస్టోలో ఇతర పార్టీ వాళ్ళను పార్టీలోకి తీసుకోవద్దు అని పెడతారని విమర్శించారు.

Read Also: Bandi Sanjay: ఆపన్న హస్తం కాదు, భస్మాసుర హస్తం.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం

కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి రాదని హరీష్ రావు జోస్యం చెప్పారు. అటు ఉన్న సూర్యుడు ఇటు పొడిచినా కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. మీరు ఎన్ని చేస్తారో చేయండి కానీ గుర్తు పెట్టుకొండి.. మేము వడ్డీతో సహా మీకు తిరిగి ఇస్తామని ఆయన హెచ్చరించారు. మీరు ఎన్నిచేసినా ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మిమ్మల్ని వదిలిపెట్టమని, మీ వెంట పడుతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.