Site icon NTV Telugu

Harish Rao : వందే భారత్ ఓపెనింగ్‌కు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా ?

Harish Rao

Harish Rao

వందే భారత్ ఓపెనింగ్ కు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా ? ఎందుకు రాష్ట్రపతిని పిలవలేదని నేను అడుగను… అది నా రాజకీయ విజ్ఞత అంటూ వ్యా్‌ఖ్యానించారు మంత్రి హరీష్‌ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ కు కొన్ని అవకాశాలు రాజ్యాంగంలో ఇచ్చారని, 26 జనవరి గవర్నర్ జెండా ఎగుర వేయాలని ఉందన్నారు. గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నన్ను పిలవలేదని, రాష్ట్రపతి అంటున్నారా ? మహిళగా, గవర్నర్‌గా మేము గౌరవిస్తామన్నారు మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ ప్రయోజనాలను గవర్నర్ దెబ్బతీస్తున్నారని, రాష్ట్ర సర్కార్ గవర్నర్ కు బిల్లుకు పంపితే ఏమి చేయాలి? రాజ్యాంగ పరిధిలో ఉందో లేదో చూడాలన్నారు. పొదెం వీరయ్య లెటర్ ఇచ్చారని గవర్నర్ బిల్లును వాపస్ పంపించారని, క్యాబినెట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రమానీకమా ? అన్నారు. వైద్య శాఖలో ప్రొఫెసర్ ల వయో పరిమితిని పెంచుతూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుందని, బిల్లును పంపితే గవర్నర్ నిర్ణయం తీసుకోలేదన్నారు.

Also Read : Supreme Court : రెజ్లర్లకు సుప్రీంకోర్టు షాక్ .. విచారణ ప్రొసీడింగ్స్ కి స్వస్తి

కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎంసీ 70 ఏళ్ళ ఉన్నవాళ్ళని ప్రొఫెసర్ గా పెట్టుకోవాలని చట్టం తెచ్చిందని, జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టాలని కేసీఅర్ నిర్ణయమన్నారు. ప్రొఫెసర్ లు దొరకడం లేదని, 65 ఏళ్లు ఉన్న ప్రొఫెసర్ లు ఉంటే వాళ్ళ అనుభవం ను ఉపయోగించవచ్చు …అదే మా అలోచన అన్నారు. గవర్నర్ హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారని, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ల భర్తీకి నోటఫికేషన్లు ఇస్తే దొరకడం లేదని, వైద్య శాఖలో ప్రొఫెసర్ ల వయో పరిమితి పెంపు బిల్లు ను ఏడు నెలలుగా గవర్నర్ ఆపారన్నారు. గవర్నర్ అపడం ద్వారా ఏమి ఆశిస్తున్నారు ? ఏమి సాధిస్తున్నారు ? అని ఆయన మండిపడ్డారు. అసలు రాజ్ భవన్ కు మేము ఎందుకు పోవాలని, అయినా రాష్ట్ర సర్కార్ తరపున ప్రతినిధులు వెళ్లి వివరణ ఇచ్చారన్నారు. బిల్లులో మార్పులు చేసే అవకాశం గవర్నర్ కు ఉండదని, సుప్రీం కోర్టులో కేసు వేస్తే… బిల్లుల పై ఏడు నెలల తర్వాత కదలిక వచ్చిందన్నారు.

Also Read : Karnataka Elections 2023: ఓట్లకు ఇంకా వారం టైం ఉంది.. కానీ ముందే ఓటేసిన తాత

Exit mobile version