Karnataka Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరుమీద ఉన్నాయి. ఎలగైనా అధికారం చేజిక్కించుకోవాలని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో అనేక వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా వారం రోజులు ఉండగానే ఓ శతాధిక వృద్ధుడు ఓటేశాడు. ఓవైపు ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగానే తాత ఓటెయ్యడం అక్కడ చర్చనీయాంశమైంది. అతడికి ఆ అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది.
Read Also: Nithish Kumar : సీఎం నితీష్కు షాక్.. బీహార్ కులగణనపై పాట్నా హైకోర్టు స్టే
కరోనా మహమ్మారి దెబ్బతో ప్రపంచం మొత్తం తలకిందులైంది. అన్ని రంగాల్లోనూ మార్పులొచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ విధానాల్లోనూ మార్పులను తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం మాదిరిగా కరోనాతో బాధపడుతున్నవారితో పాటు వృద్దులకు ‘వోట్ ఫ్రం హోం’ సదుపాయం కల్పించింది. అంటే కురువృద్ధులై ఉండి వారి వయసు 80 ఏళ్లు పైబడి.. పోలింగ్ బూత్ వరకు నడిచే పరిస్థితి లేని వారు ఇంటివద్దే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.
Read Also: DK Shiva kumar: శివ శివ.. నీకే ఎందుకిలా.. టైం బాగోలేనట్టుంది
కాకపోతే ఇంటినుండే ఓటు హక్కును వినియోగించుకుంటామని ముందుగానే ఈసీకి సమాచారం అందిచాలి. అప్పుడు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలింగ్ రోజుకంటే ముందే ఓటేయవచ్చన్న మాట. ఈసీ కల్పించిన ఆ అద్భుత అవకాశాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ శతాధిక వృద్దుడు ఉపయోగించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని చిక్కోడికి చెందిన మహాదేవ మహాలింగమాలి 103 ఏళ్ల వయసులోనూ ఓటేయాలనుకున్నాడు. వయసు రీత్యా పోలింగ్ బూత్ వరకు వెళ్లేందుకు తనకు శరీరం సహకరించదు. కాబట్టి ఇంటి నుండే ఓటేస్తానని ఈసీకి విన్నవించుకున్నాడు. దీంతో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. రహస్యంగా తనకు ఇష్టమైనవారికి ఆయన ఓటేయగా ఆ బ్యాలెట్ పేపర్ ను అధికారులు తీసుకున్నారు. అనంతరం ఓటేసినట్లు అతడి వేలికి సిరా అంటించారు. ఈ క్రమంలో ఇన్నేళ్ల వయసులోనూ ఓటేసిన మహాదేవను కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఫోన్ చేసి అభినందించారు. ఇక తనకు ఇంటివద్దే ఓటేసే అవకాశం కల్పించిన ఈసికి మహాదేవ మహాలింగ కృతజ్ఞతలు తెలిపారు.