గవర్నర్ ఎమ్మెల్సీ అభ్యర్థులని తిరస్కరించడంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎరుకల జాతి, విశ్వ బ్రహణులుకు సీఎం ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని, గవర్నర్లను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎరుకల జాతిని రిజెక్ట్ చేసిందని, మీరంతా బిజెపికి గుణపాఠం చెప్పాలన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపిలో ఉండి తమిళి సై గవర్నర్ కావచ్చని, కుర్రా సత్యనారాయణ మాత్రం బీఆర్‌ఎస్‌లో ఉండి ఎమ్మెల్సీ కావద్దా అని ఆయన ప్రశ్నించారు. ఇక, అంతకుముందు.. సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను హరీష్ రావు ప్రారంభించారు.
Also Read : Narne Nithin: ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారు… థాంక్యూ బావ!
175 సీట్లు సిద్దిపేట మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారని, ఇందులో 25% అంటే 25 సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతారని, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఏంటో అర్థం అవుతుందని ప్రశంసించారు. గతంలో సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పంపించేవారు కానీ ఇకపై నుండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని, నూతన క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇకనుండి క్యాన్సర్ చికిత్స కూడా ఇక్కడే అందించబడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.
Also Read: Shriya Saran : లాంగ్ బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్న శ్రీయ.. ఇలా చూపిస్తే ఎలా పాప..