Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: అమెరికా పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని ప్రకటించారు. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని, ప్రాజెక్టు లక్ష్యాల్లో మార్పులు జరిగితే రైతుల భూములను తిరిగి ఇవ్వాల్సిందేనని పార్లమెంట్ చట్టంలో నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోందని ఆరోపించారు. ఇటీవల తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం ఫార్మా సిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నట్లు తెలిపిందని హరీష్ రావు అన్నారు. బయట ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రచారం చేస్తూ, కోర్టులో మాత్రం వేరే వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఫార్మా సిటీతో పాటు విద్య, గృహ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం సహజమేనని, కానీ అసలు ప్రాజెక్టు లక్ష్యాన్ని మార్చడం సరైన విధానం కాదని హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. ఫార్మా సిటీ కోసం ఉద్దేశించిన భూభాగంలో ప్రధాన భాగాన్ని ఇతర వ్యాపార అవసరాలకు వినియోగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఫార్మా సిటీ ప్రాజెక్టును ప్రారంభించామని, రాష్ట్రం నుంచి ఒక్క ఫార్మా కంపెనీ కూడా బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!