సిగ్గులేకుండా మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, మూసీ బాధితులకు సీఎం రేవంత్ ఏం న్యాయం చేశారన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, కాంగ్రెస్ తెచ్చిన భూ చట్టం కంటే మెరుగైన సహాయం మేము చేశామన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్క ఇల్లు అయిన కట్టించారా అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, ఒక్క గజ్వేల్ లొనే 3 వేలకు పైగా ఇల్లు కట్టి మేము నిర్వాసితులకు ఇచ్చామన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులపై కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్, 25 వేల రూపాయలు ఖర్చుకు ఇస్తున్నామని సీఎం రేవంత్ గొప్పలు చెబుతున్నారన్నారు హరీష్ రావు. మల్లన్న సాగర్ భూ సేకరణ చేసినప్పుడు పాత ఇంటికి రెండింతలు నష్ట పరిహారం ఇచ్చామని, దీని కోసం 694 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఇంటి యజమాని, భార్యకు 7 లక్షల 50 వేలు ఉపాధి కోసం ఇచ్చామని, ఇంట్లో 18 ఏళ్ళు దాటిన పెళ్లికాని వారికి ఉపాధి కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు హరీష్ రావు. అందరికి ఇల్లు కట్టి ఇచ్చాము…పెళ్లి కాని వారికి కూడా 250 గజాల స్థలం ఇచ్చామని, ఖర్చులకు 30 వేల నుంచి 50 వేల రూపాయలు ఇచ్చామన్నారు. గజ్వేల్ నడిబొడ్డున డబుల్ రూమ్ ఇల్లు కట్టి ఇచ్చామని, మూసీ బాధితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రేవంత్ ఇచ్చి గొప్పలు చెబుతున్నారన్నారు.
Team India: న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడో టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు ఇదే..
అంతేకాకుండా..’నీకు దమ్ముంటే గజ్వేల్ లో కేసీఆర్ ఇండ్లు కట్టిచ్చినట్టు కట్టివ్వాలి. గచ్చిబౌలిలో 50ప్ ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గచ్చిబౌలిలో మూసి బాధితులకు 250 గజాల ఇల్లు కట్టి ఇవ్వాలి రేవంత్. ముంపు గ్రామాలకు 2 వేల కోట్లు ఇచ్చారు కేసీఆర్.. ఇంకో 200 కోట్ల రూపాయలు బాకీ ఉండొచ్చు.. మేము 90 శాతం చేసినం నువ్వు మిగిలిన 10 శాతం చెయ్యి మరి.. మీరు ఇంకొన్ని కలిపి ముంపు బాధితులకు ఇవ్వండి మేము వద్దన్నమా..? మీరు సహాయం చేస్తే నేనె వచ్చి మీకు సన్మానం చేస్తా.. కాంగ్రెస్ వచ్చి ఏడాది అయ్యింది… మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా..? మోసం, దగా, గోబెల్స్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీవి.. ప్రజలు మమ్మల్ని కాదని మీకు అవకాశం ఇచ్చారు..మీరు బాగా పని చేయండి.. ఆ రోజు మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకున్నారు.. ఈ రోజు మల్లన్నసాగర్ నిర్వాసితులపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. మీ సొల్లు వాగుడు బంద్ చేయండి..’ అని హరీష్ రావు అన్నారు.
Bihar: సన్యాసిగా భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీ.. బీహార్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్..