NTV Telugu Site icon

Harish Rao : ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు

Harish Rao

Harish Rao

ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీష్‌ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు, దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను‌ ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. 15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు‌ సున్నా చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడని హరీష్‌ రావు మండిపడ్డారు. ముదిరాజ్, గంగపుత్రులంటే సీఎం రేవంత్ కు చిన్నచూపని, ఆగస్ట్ లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదన్నారు. మేము 100కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్ లో పెట్టిందె 16కోట్లు అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. చేప పిల్లలు డబుల్ పోస్తామని చెప్పి.. ఇప్పుడు చేప పిల్లలు సగమే పోయాలని అంటున్నారన్నారు. చెరువులు నిండుకుండలా ఉన్నప్పటికీ.. చేప పిల్లల సగమే పోయాలంటున్నారని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటూ ఆయన సెటైర్‌ వేశారు.

Railway: రైలులో ప్రయాణించే రోగులకు రైల్వే ప్రత్యేక రాయితీ.. ఏ రోగులకు ఎంత రాయితీ తెలుసా..?

అంతేకాకుండా..’కాంగ్రెస్ ముఖ్యనేతల కోసం రీజల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చారు. ముఖ్యనేతల భూములున్నాయని రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కొందరు స్వార్థం కోసం ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చటం దారుణం. దీని వలన 16కిమీ దూరం పెరుగుతుంది. కేంద్రమే నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ.. దక్షిణ భాగాన్ని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామంటోంది. దీని వలన 20వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతాయి. కొందరు స్వార్థం కోసం ప్రజలపై 20వేల‌ కోట్లు భారం పడుతుంది. రుణమాఫీకి పుట్టని అప్పు.‌. రింగ్ రోడ్ నిర్మాణానికి పుడుతున్నాయా? ఉత్తర భాగం 158కిమీ కేంద్రమే నిర్మిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10నెలలు అయినా కూడా ఉత్తర భాగం నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. రైతులకు మార్కెట్ రేటు ఇచ్చి భూసేకరణ చేయాలి’ అని హరీష్ రావు అన్నారు.

Russian-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి.. 136 డ్రోన్లు ప్రయోగం