ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ బీఆర్‌ఎస్‌దే అని ఉద్ఘాటించారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలో కొంత మంది చేరుతున్నారని, వాళ్ళు కేసీఆర్ పక్కన పెట్టిన వాళ్ళేనని వెల్లడించారు. మాజీ సీఎం చంద్రబాబు తెలంగాణ వస్తే మీరు అగమైతరు అన్నారని, మనల్ని తిట్టినోళ్లే నోరు ఎల్లపెడుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Also Read : MonSoon: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి వాడండి..!
ఎప్పుడు తిట్టే చంద్రబాబు మనల్ని పొగిడిండు అంటే అది కేసీఆర్ వల్లనే అని, ఈ సారి ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిపించి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ వద్దని అనుకున్న వాళ్ళు ఇతర పార్టీలో చేరుతున్నారని, రైతుల కోసం నిజాయితీగా సేవ చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మహారాష్ట్ర పాలకులు రైతులను ఆదుకోవడంలో ఫెయిల్ అయ్యారని, జహీరాబాద్ లో ముగ్గురు లీడర్లు కలిశారు..ఇంకో పార్టీ అడ్రస్ గల్లంతు అవడం ఖాయమంటూ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Also Read : Ishant Sharma: భారత్, వెస్టిండీస్ సిరీస్‌లో కనిపించనున్న ఇషాంత్ శర్మ.. కానీ మ్యాచ్లో కాదు..!
ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్ కి బహుమతి ఇద్దామని, బీజేపీవి అన్ని జుటా మాటలు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.. అంటే 18 కోట్ల ఉద్యోగాలు ఈ 9 ఏళ్లలో బీజేపీ ఇవ్వాలని, ఒక్క ఉద్యోగం కూడా బీజేపీ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.
