Site icon NTV Telugu

Haris Rauf: హారిస్‌ రవూఫ్‌కు మద్దతు.. పాకిస్థాన్ మహిళా ప్లేయర్స్ సైతం కవ్వింపులు!

Pakistan Women Players

Pakistan Women Players

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్‌లు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం పెను దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాకిస్థాన్ ఆటగాళ్లతో సహా మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దాయాది దేశాలు గ్రూప్-4లో తలపడగా.. పలుసార్లు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ సీనియర్ పేసర్ హారిస్ రవూఫ్ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. భారత అభిమానులు ‘కోహ్లీ, కోహ్లీ’ అంటూ అరిచారు. దీంతో హారిస్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అభిమానుల వైపు తిరిగి.. తన చేతితో ‘6-0’ అంటూ సైగలు చేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ ప్రయోగించిన 6 ఫైటర్ జెట్‌లను పాక్ కూల్చివేసినట్లు సైగలు చేశాడు. ఇప్పటివరకు 6 జెట్ ఫ్లైట్స్‌కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టలేదు కానీ.. అదే నిజమని పాక్ క్రికెటర్లు నమ్ముతున్నారు. అందులో భాగంగానే హారిస్ కావాలనే అలా సైగలు చేశాడు.

Also Read: Samsung Discounts: శాంసంగ్‌ బిగ్ సేల్.. అదనపు టీవీ, ఉచిత సౌండ్‌బార్ మీ సొంతం!

హారిస్ రవూఫ్ తీరుపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే పాకిస్థాన్ నుంచి మాత్రం అతడికి రోజురోజుకు మద్దతు పెరగుతోంది. హరీస్ సతీమణి ముజ్నా మసూద్ మాలిక్ పెట్టిన పోస్ట్ ఆగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. హరీస్ 6-0 సంజ్ఞను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘మ్యాచ్ ఓడినా యుద్దం గెలిచాం’ అని క్యాప్షన్‌గా పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్ మహిళా ప్లేయర్స్ సైతం కవ్వింపులకు దిగుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నష్రా సంధు, సిద్ర అమిన్‌లు 6-0 సంజ్ఞ చేశారు. పాక్ ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇద్దరు మహిళా ప్లేయర్స్ ఈ సంజ్ఞ చేసినట్లు తెలుస్తోంది. నష్రా, సిద్ర తీరుపై భారత ఫాన్స్ మండిపడుతున్నారు. ‘మీకు ఇదేం పోయేకాలం’ అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

Exit mobile version