Harirama Jogaiah: పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ.. ఇప్పుడు వాటిపై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇప్పటికే వివిధ అంశాలపై లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య.. ఇప్పుడు పవన్‌కు బహిరంగ లేఖ రాశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కల్యాణ్ వెంట నడవడం లేదన్న ఆయన.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు. అధికారంలోకి వస్తే రెండున్నర ఏళ్లు.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు చేగొండి హరిరామ జోగయ్య.
Read Also:Ram Gopal Varma: వర్మ ఒళ్లో మరో అందమైన భామ.. ఎవరో తెలుసా?
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇక, స్వాతంత్ర్యం వచ్చి నాటి నుంచి నేటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య మినహా ఇప్పటి వరకు అగ్రవర్ణాలలో 6 శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4 శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప 80 శాతం ఉన్న మిగిలిన బడుగు, బలహీనవర్గాల వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులు అధిష్టించి పరిపాలనా అధికారం చేపట్టిన వారు ఎవరూ లేరని పేర్కొన్నారు హరిరామ జోయ్యగ.. ఇక, ఆనాటి నుంచి 25 శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు, బీసీ కులస్తులుగా గుర్తింపు పనొందకుండా విద్య, ఉద్యోగ, రాజకీయాలలో రిజర్వేషన్స్ సౌకర్యం పొందకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్ప వేరే మార్గలం లేదని గ్రహించిన కాపు సామాజికవర్గం ఈ దిశగా ప్రయాణం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయని.. ప్రజలలో మంచి చరిష్మా కలిగి పవన్ కల్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా చేస్తున్న ప్రయాణంలో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకుని.. ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ.. ఆయనతో కలిసి ముందుకు నడుస్తున్న మాటను కాదనలేమని తన లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.. ఇక, మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య.. రాసిన పూర్తి లేఖకు కింద జత చేయడం జరిగింది.



తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!