Harirama Jogaiah: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోలేఖ రాశారు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య.. ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. టీటీడీ చైర్మన్ రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపు కులస్తుల అవసరం మీకు ఉన్నదని రుజువు చేసుకోవాలన్న కాపుల పట్ల సానుభూతి ఉన్నా.. టీటీడీ చైర్మన్ బలిజకి ఇవ్వాలని కాపు కులస్తుల తరఫున కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు 22 శాతం జనాభా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కాపులను వాడుకోవడం తప్ప కాపులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా ఏ రెడ్డి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేయలేదు.. చివరకు మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం అవకాశం ఉండి కూడా కాపులకు రిజర్వేషన్ కల్పించలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య.