Kapu Reservation: సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ!
- హరిరామ జోగయ్య బహిరంగ లేఖ
- ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలని డిమాండ్
- ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తనకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్ కోసం హరిరామ జోగయ్య ఎప్పటినుంచో పోరాడుతున్న విషయం తెలిసిందే.
‘8-3-2019 టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 45తో 14 నెంబర్ చట్టం ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి.. ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేదు. కాపు సంక్షేమ సేన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మేము వేసిన పిటిషన్‌కు గత వైసీపీ ప్రభుత్వం కౌంటర్‌గా 5% రిజర్వేషన్ అమలు చేయకూడదని అభ్యంతరం తెలిపింది. కూటమి ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టుకు రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలి. డిసెంబర్ 4న న్యాయస్థానంలో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్‌నే సమర్థిస్తూ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్తావించడం జరిగింది. ఈనెల జనవరి 28న న్యాయస్థానంలో తదుపరి విచారణ జరగనుంది, ఈలోపు కూటమి ప్రభుత్వం కాపుల పట్ల స్టాండ్ ఏంటో తెలపాలి. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలి. జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు రిజర్వేషన్ అంశంలో కలిసి పని చేద్దామని దీక్ష విరమింప చేయమని నాకు ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి’ అని చేగొండి హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!