ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరి ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడిన ఆఖరికి ముంబై వైపు మొగ్గు చూపించింది. ఫలితంగా హార్దిక్ సేన ఈ సీజన్‌లో ఎట్టకేలకు మూడో విజయాన్ని నమోదు చేసింది. అయితే, గురువారం నాడు జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా, చంఢీగడ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ చేసింది.
Read Also: MAD Square: మొన్న టిల్లు స్క్వేర్.. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ(78) సాధించగా.. రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ(18 బతుల్లో 34-నాటౌట్) రాణించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 14/4 స్కోరుతో తేలికగా మ్యాచ్‌ను ముంబైకి ఇచ్చేస్తుంది అనుకునే సమయంలో పంజాబ్ హీరోలు శశాంక్ సింగ్(25 బంతుల్లో 41), అశుతోశ్ శర్మ(61) రెచ్చిపోవడంతో.. ముంబై జట్టుకి చెమటలు పట్టించారు. ఓ దశలో మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పేశారు అనే అనుమానం వచ్చింది. టెయిలెండర్ హర్‌ప్రీత్ బ్రార్(21) పోరాడిన ఫలితం లేకపోయింది. చివర్లో హర్షల్ పటేల్(1 నాటౌట్)తో పాటు కగిసో రబడ క్రీజులో ఉండగా ఆఖరి ఓవర్‌లో పంజాబ్ విజయ 12 పరుగులు కావాల్సి వచ్చింది.
Read Also: Gold Heist: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ.. ఇద్దరు ఇండియన్స్ అరెస్ట్..
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా పేసర్ ఆకాశ్ మధ్వాల్ తో బౌలింగ్ వేయించాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో.. తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాశ్ మధ్వాల్ ఫీల్డ్ సెట్ చేసే సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకున్నాడు. కానీ, అదే సమయంలో హార్దిక్ పాండ్యా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఆకాశ్ పెద్దగా పట్టించుకోలేదు.. రోహిత్‌తో చాలా సేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
My guy, Madhwal was trying his best not to look at Hardik 😭😭😭 pic.twitter.com/DlWlHj2BV7
— ab (rohit's version) (@ydisskolaveridi) April 18, 2024