Hardik Pandya Watch: పాండ్య వాచ్ ధర ముందు.. పాక్ కెప్టెన్ జీతం కూడా దిగదుడుపే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Watch: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మైదానం బయట తన స్టైల్‌తోనూ అంతే సందడి చేస్తుంటాడు. తాజాగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హార్దిక్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బతీయడమే కాకుండా, తన చేతి గడియారంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. మహాశివరాత్రి పర్వదినం రోజున జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. దాని డిస్ప్లేపై ధ్యానంలో ఉన్న పరమశివుడి (రుద్రుడు) ఆకృతి ఉంటుంది.
Also Read
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
- Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
- IND vs ZIM: "ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు".. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
శివుడి రూపంలో ‘రుద్ర’ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే!
బ్రాండ్: లగ్జరీ వాచ్ మేకర్ ‘జాకబ్ అండ్ కో’ (Jacob & Co).
మోడల్: ఎపిక్ ఎక్స్ స్పోర్ట్ ‘రుద్ర’ ఎడిషన్ (Epic X Sport ‘Rudra’ Edition).
ప్రత్యేకత: ఈ మోడల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 25 వాచీలు మాత్రమే తయారు చేశారు. ఇవి కేవలం కంపెనీకి అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే దక్కుతాయి.
ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!
ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధర దాదాపు రూ. 25 లక్షల పైమాటే అని అంచనా. ఒక ఆసక్తికరమైన పోలిక ఏమిటంటే.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా నెలవారీ జీతం కంటే ఇది దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువ అని సమాచారం. పాక్ క్రికెట్ బోర్డ్ (PCB) సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం, కెప్టెన్‌కు నెలకు సుమారు రూ. 7 లక్షల వరకు జీతం అందుతుంది. అంటే పాక్ కెప్టెన్ మూడు నెలల జీతం పెట్టినా, హార్దిక్ ధరించిన ఈ ఒక్క వాచ్ ఖరీదుతో సరిపోదని నెట్టింట జోరుగా చర్చించుకుంటున్నారు.
ఈ వాచ్‌లోని అదిరిపోయే ఫీచర్లు:
మెటీరియల్: ఇది గ్రేడ్-5 టైటానియంతో తయారైంది, ఇది చాలా తేలికగా, ధృడంగా ఉంటుంది.
డిజైన్: వాచ్ లోపలి భాగం మొత్తం కనిపించేలా ‘స్కెలిటైన్’ డిజైన్‌తో ఉంటుంది.
వాటర్ రెసిస్టెన్స్: 50 మీటర్ల లోతు వరకు నీటిలో ఉన్నా ఏమీ కాదు.
బ్యాటరీ: ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 70 గంటల పాటు నిరంతరంగా పనిచేస్తుంది.
READ ALSO: Dum Biryani: హోటల్ రుచితో చికెన్ దమ్ బిర్యానీ.. ఈజీగా కేవలం ఒక గంటలోనే ఇలా చేసేయండి!
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?