Hardik Pandya: గంభీర్‌కు గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మెగా ఫైనల్‌లో తలపడేందుకు టీమ్ ఇండియా శుక్రవారం (మార్చి 6) సాయంత్రం అహ్మదాబాద్ చేరుకుంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న భారత్, ఇప్పుడు కివీస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబైలో జరిగిన సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియా, శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తమ వ్యక్తిగత కార్లలో వెళ్లగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇతర ఆటగాళ్లు కలిసి హోటల్‌కు చేరుకున్నారు.
READ ALSO: Kitchen Vastu Tips: కిచెన్ లో ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులే..! శాస్త్రీయ కోణం కూడా ఉంది..
Also Read
- Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్యా వీడియో..
ముంబై ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు పరిచయం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. మాహికా శర్మ ఈ వరల్డ్ కప్ టోర్నీ అంతటా హార్దిక్ వెంటే ఉంటూ టీమిండియాను ప్రోత్సహిస్తున్నారు. సెమీఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ కుమారుడు అగస్త్యతో కలిసి ఆమె మ్యాచ్ వీక్షించారు. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో భారత్ గెలిస్తే పలు ప్రపంచ రికార్డులు బద్దలవుతాయి. టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్ గెలిస్తే, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా తమ సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌ను గెలవలేదు. భారత్ విజయం సాధిస్తే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్రపుటల్లో శాశ్వత కీర్తిని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడుతున్న మొదటి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ జట్టుకు నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. పెద్ద మ్యాచుల్లో ఎప్పుడైనా గట్టి పోటీనిచ్చి ఫలితాన్ని తారుమారు చేసే సామర్థ్యం కివీస్‌కు ఉందని క్రీడా విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, 1.30 లక్షల మంది ప్రేక్షకుల మధ్య హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండటం టీమిండియాకు అతిపెద్ద బలంగా చెబుతున్నారు.
READ ALSO: Sai Madhav Burra: ‘కథను మానభంగం చేశారు’.. ఓ లేటెస్ట్ మూవీపై సాయి మాధవ్ బుర్ర సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!