Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
- పశ్చిమ ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.
- సనందజ్ సమీపంలో ఇంధన ట్యాంకర్ పేలుడు.
- ఇతర వాహనాలను ఢీకొన్న తర్వాత ట్యాంకర్లో మంటలు.
- ఈ ఘటనలో 11 మంది మృతి, ఏడుగురికి గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: యుద్ధంతో ఉక్కిరిబిక్కిర అవుతున్న వేళ, ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఇరాన్‌లోని సనందజ్ సమీపంలో ఓ ఇంధన ట్యాంకర్ ఇతర వాహనాలను ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లోని సనందజ్-హమదాన్ మధ్య ఇంటర్ సిటి రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. సనందజ్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న సమయంలో ట్యాంకర్ ఇతర కార్లను ఢీకొట్టినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
ఆ తర్వాత వెంటనే మంటలు చెలరేగి, పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ట్యాంకర్ బ్రేకింగ్ వ్యవస్థలో వైఫల్యం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్యాంకర్ మంటలు ఇతర వాహనాలకు వ్యాపించాయి. దీంతో మరణాల సంఖ్య పెరిగింది. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని చికిత్స కోసం సనందజ్లోని ఆస్పత్రికి తరలించారు. 2018లో కూడా ఇదే ప్రాంతలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కూడా ఇంధన ట్యాంకర్ వల్లే ప్రమాదం జరిగి 15 మంది చనిపోయారు.
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు