భద్రాచలం రామయ్యను చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు. ప్రతిరోజూ జరిగే కార్యక్రమాల మాట అటుంచితే సీతారామ కల్యాణం, రాముడి పట్టాభిషేకం సమయంలో భక్తుల తాకిడి మామూలుగా ఉండదు. శ్రీరాముడు ఎక్కడుంటే అక్కడ ఆయన పరమభక్తుడు హనుమంతుడు ఉంటాడు. భక్తులకు కనువిందు చేస్తుంటాడు. అందుకే శ్రీరామనవమి, రాముడి పట్టాభిషేకం అనంతరం హనుమంతుడి జన్మోత్సవం జరుగుతుంటుంది. శోభాయాత్రలతో ఆలయాలు కళకళలాడుతుంటాయి.
Read Also: CM KCR: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి..
పుర వీధుల్లో జై శ్రీరామ్, జై భజరంగభళి, జై హనుమాన్ నినాదాలు మారుమోగుతూ ఉంటాయి. భద్రాద్రి ఆలయంలో వానరాల సందడి అంతా ఇంతా కాదు. రాముడికి అభిషేకం చేస్తూ హడావిడిగా ఉన్నారు ఆలయ పూజారులు. ఇదే సమయంలో విశేష అతిథులు ఆలయం గోపురంపై సందడి చేశారు. రామయ్య అభిషేకం చూసేందుకు వచ్చారు వానరులు.. సాక్షాత్తూ హనుమ, సుగ్రీవుడు కలిసి వచ్చినట్టుంది. ఈ వానరులు కలిసి వచ్చిన దృశ్యం భక్తిటీవీలో ప్రసారం అయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భక్తులు ఈ వీడియోలు చూసి భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఆ సంగతేంటో మీరూ ఓ లుక్కెయ్యండి.