అమరావతి రాజధాని పరిరక్షణే ధ్యేయంగా అమరావతి రైతులు, రైతు సంఘాలు, మహిళలు, వైసీపీయేతర పార్టీలు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర 24 రోజులుగా అవిశ్రాంతంగా సాగుతోంది. ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అలుపెరగని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. 24 రోజులుగా యాత్ర చేసి కాళ్లు బొబ్బలెక్కిన మహిళలకు నరసరావుపేటలో అపూర్వ గౌరవం లభించింది. టీడీపీ ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు పాలాభిషేకం చేశారు. నిర్విఘ్నంగా…