సమ్మర్ వచ్చిందంటే చాలు వేడికి చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి.. అయితే వేడిని తట్టుకోవడం కోసం చాలా మంది స్విమ్మింగ్ చెయ్యడం చేస్తారు.. అలా చెయ్యడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.. కాస్త ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. అయితే బావులల్లో కాకుండా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
బయట స్మిమ్మింగ్ పూల్ లో వాటర్ పాడవ్వకుండా ఉండేందుకు కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఆ నీటిలో ఎక్కువ సేపు ఆడుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి.. అయితే స్విమ్మింగ్ కు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. స్విమ్మింగ్ పూల్ వాటర్ లో క్లోరిన్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న సహజ నూనెలను తొలగిస్తుంది. అందుకే… పూల్ లోకి దిగే ముందు క్లోరిన్ న్యూట్రలైజింగ్ లోషన్‌ను చర్మానికి రాసుకోవాలి. అది లేదంటే సహజ నూనెలను వాడటం మంచిది..
స్విమ్మింగ్ పూల్ లో దిగడానికి ముందు వాటర్ ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి.. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటలు వచ్చిన తర్వాత స్నానం చేసేందుకు కఠినమైన సబ్బులను అస్సలు వాడకూడదు.. అలాగే షాంపులను కూడా అస్సలు వాడకూడదు… శరీరాన్ని పొడిగా తుడవండి, తడిగా ఉంటే… చర్మంపై ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు పెదవులు ఎండిపోకుండా లిప్ బామ్ లను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.