Hamas Chief Ismail Haniyeh Dead in Iran: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం టెహ్రాన్‌లోని అతని నివాసంపై జరిగిన దాడిలో ఇస్మాయిల్ హత్యకు గురయ్యారరు. ఈ విషయాన్ని పాలస్తీనా గ్రూప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్మాయిల్ సహా అతని బాడీగార్డ్ ఒకరు కూడా చనిపోయారని పేర్కొంది. దీనిని ఇజ్రాయెల్ దాడిగా హమాస్ అభివర్ణించింది.
Also Read: Suryakumar Yadav: నేను వేసిన చివరి ఓవర్ మ్యాజిక్ కంటే.. మా కుర్రాళ్ల ఆటే ఆకర్షించింది: సూర్య
సోదరుడు, ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారకార్యక్రమానికి ఇస్మాయిల్ హనియా హాజరై ఇంటికి వచ్చిన తర్వాత దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చీఫ్ ఇస్మాయిల్ హనియా చనిపోవడంతో హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇక ఇస్మాయిల్ ముగ్గురు కుమారులను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో వీరు మృతిచెందారు.