మాములుగా ఆడవారికి అందమైన ఆకృతి, అందమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు.. అందుకోసం రకరకాల టిప్స్ ఫాలో అవుతారు.. కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు. రకరకాల షాంపూలు బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.. పొడవాటి జుట్టు కోసం కొబ్బరిపాలు మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొబ్బరి పాలను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..
కొబ్బరి పాలలో కాటన్ బాల్స్ ను ముంచి ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న జిడ్డు మురికి తొలగిపోతుంది. అలాగే కొబ్బరిపాలు, తేనె, గుడ్డు మూడింటిని కలిపి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం తేమగా, మృదువుగా తయారవుతుంది.
అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పొడవాటి జుట్టు కోసం కొబ్బరి పాలు, గుడ్డు, పెరుగు కలిపి హెయిర్ మాస్క్ వేసుకోవడం మంచిది.. జుట్టు సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి..
కొబ్బరిపాలు తేమను కోల్పోకుండా చేస్తుంది.. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన65 సమస్యలు దరిచేరవు . జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. అలాగే ఈ పాలల్లో జుట్టుకి అవసరమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి, ఇది జుట్టు నిగనిగలాడేందుకు, దృఢంగా మార్చడంలో, జుట్టును పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరిపాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి… చలికాలంలో వచ్చే పగుళ్లు, పొడి బారడం సమస్యను తగ్గిస్తుంది.. కొబ్బరి పాలను తాగినా కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు yచెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.