చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.. చర్మ సమస్యలు మాత్రమే కాదు జుట్టు సమస్యలు కూడా వస్తుంటాయి.. గాలిలో తేమ పెరిగి పోవడం వల్ల జుట్టు పొడి బారిపోయి.. చిట్లి పోతుంది. ఈ కాలంలో ఎక్కువగా జుట్ట డ్యామేజ్‌కి గురవుతుంది. అయితే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలే సమస్యల నుంచి బయట పడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హెయిర్ మాస్క్ వేసుకోవడం మంచిది.. ఉసిరి, వేప, మందార వంటి ఆయుర్వేద మూలికలు ఉపయోగించి.. పోషకమైన హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవాలి. వీటిని తలకు పట్టించడం వల్ల.. జుట్టుకు బలం చేకూరుతుంది. అదే విధంగా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయ పడతాయి. అలాగే పెరుగు లేదా కొబ్బరి నూనెలో పొడి మూలికలను కలిపి హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు ఊడటం ఆగిపోతుంది..
మీరు రాసుకొనే నూనెను బాగా వేడి చేసి మర్దన చేసుకోవడం మంచిది.. ఇలా చేస్తే స్కాల్ఫ్‌లో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. దీంతో జుట్టు కుదుళ్లకు బలం పెరిగి, ఊడి పోకుండా, చిట్లకుండా చూస్తుంది… జుట్టు ఒత్తుగా, నల్లగా ఉంటుంది..
చలికాలంలో మీ శరీరం, జుట్టు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. దీని వల్ల మీ శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. మీ స్కాల్ఫ్ పొడి బారకుండా ఉండేందుకు నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల శరీరం కూడా హైడ్రేట్ అయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.. జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది.. శరీరం కూడా పగలకుండా ఉంటుంది..
మంచి ఆహారాన్ని తీసుకోవాలి.. మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు మంచి పోషణ అందుతుంది. మీ ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు, గింజలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి.. వీటిని క్రమంలో తప్పకుండ తీసుకోవడం శరీరం మంచిగా ఉంటుంది.. అప్పుడే ఎటువంటి వ్యాధులు కూడా రావు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.