Haier Launches Lumiere 4 Door Refrigerator in India: భారత గృహ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హైయర్ (Haier) కొత్తగా Lumiere Colourful 4 Door Refrigerator ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆధునిక వంటగదులకు సరిపోయే ప్రీమియం డిజైన్, అధునాతన టెక్నాలజీతో ఈ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. హైయర్ లూమియర్ 4 డోర్ రిఫ్రిజిరేటర్ 520 లీటర్ల సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో పాటు గ్లోస్, మ్యాట్ ఫినిష్‌లలో లభిస్తుంది. ఈ సిరీస్‌ను పెర్ల్ వైట్, పింక్, రోసెట్ వైట్ అనే మూడు ఆకర్షణీయ రంగుల్లో మార్కెట్లోకి తీసుకువచ్చారు.
Read Also: KTR: కేసీఆర్‌ను విచారణకు పిలవడం మీ అహంకారం కాకపోతే మరేమిటి?.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్!
కన్వర్టిబుల్ టెక్నాలజీ ప్రత్యేకత
ఈ రిఫ్రిజిరేటర్లో ఉన్న ప్రధాన ఆకర్షణ కన్వర్టిబుల్ జోన్. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మొత్తం స్టోరేజ్‌లో 85 శాతం భాగాన్ని ఫ్రెష్ లేదా ఫ్రోజన్ స్టోరేజ్‌గా మార్చుకునే సౌలభ్యం ఉంది. మిగిలిన 15 శాతం భాగం ఫ్రీజర్‌కు కేటాయించారు. బాహ్య నియంత్రణ ప్యానెల్ ద్వారా రిఫ్రిజిరేటర్ తెరవకుండానే ఉష్ణోగ్రత నియంత్రణ.. డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్ ద్వారా సమానమైన శీతలీకరణ.. పండ్లు, కూరగాయల కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్.. తక్కువ శబ్దంతో పనిచేసే డిజైన్.. 95 డిగ్రీల యాంటీ-టిప్పింగ్ డోర్ రాక్స్, బాటిళ్లు పడిపోకుండా రక్షణ దీని సొంతం..
ధర ఎంతంటే?
Haier Lumiere Colourful 4 Door Refrigerator ధర రూ.83,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రిఫ్రిజిరేటర్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ సందర్భంగా హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్.ఎస్. సతీష్ మాట్లాడుతూ.. లూమియర్ కలర్‌ఫుల్ 4 డోర్ రిఫ్రిజిరేటర్ స్టైల్, టెక్నాలజీకి కొత్త ప్రమాణాలను తీసుకొస్తుంది. ఇది ఆధునిక వంటగదిని మరింత విశాలంగా తయారు చేస్తుందన్నారు..