GV Prakash Kumar on Dasara Movie: ‘నేచురల్ స్టార్’ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దసరా’. గతేడాది మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దసరా సినిమాను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సింగరేణి నేటివిటీకి దగ్గరగా తీసి సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో నానితో పాటు కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు చేశారు. ముఖ్యంగా నాని (ధరణి) ఫ్రెండ్ (సూరి)గా దీక్షిత్ అదరగొట్టాడు. అయితే ఈ క్యారెక్టర్ దీక్షిత్ చేయాల్సింది కాదట.
దసరా సినిమాలో దీక్షిత్ శెట్టి చేసిన సూరి పాత్రను తాను చేయాల్సింది అని తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ తాజాగా తెలిపారు. తనకు డేట్స్ కుదరక దసరా సినిమాలో చేయలేనని చెప్పానని, ఆ తర్వాత దీక్షిత్ శెట్టి ఆ పాత్రకు ఎంపికయ్యాడు అని జీవీ ప్రకాష్ కుమార్ చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. త్వరలో ఆయన డియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Also Read: KL Rahul: 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుంది: కేఎల్ రాహుల్
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జీవీ ప్రకాష్ కుమార్.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యుగానికి ఒక్కడు, ఆడుకాలం, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, సార్, కెప్టెన్ మిల్లర్ సినిమాలకు సంగీతం అందించి.. బ్లాక్ బస్టర్‌లు అందుకున్నారు. హీరోగా కూడా మంచి విజయాలు ఖాతాలో వేసుకున్నారు.