Harsha Kumar: హర్షకుమార్ సవాల్.. తాను చెప్పింది నిజంకాదని రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..!
- పోలవరంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ బహిరంగ సవాల్..
- తాను చెప్పినవి నిజంకాదని ఇంజనీర్లు ఎవరైనా రుజువు చేస్తే..
- తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేసిన హర్ష కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harsha Kumar: తాను చెప్పినవి నిజంకాదని ఇంజనీర్లు ఎవరైనా రుజువు చేస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటూ బహిరంగ సవాల్ విసిరారు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ పార్టీలు రెండూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. 500 కోట్లతో రుషికొండ మీద ప్యాలెస్ జగన్ నిర్మించి దుర్వినియోగం చేస్తే, పోలవరం ప్రాజెక్టు ప్రజలకు చూపించడానికి చంద్రబాబు 500 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ నిర్మాణాలు పక్కా ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగలేదన్నారు. ఈ రెండు దెబ్బతినదానికి కారకులైన అధికారులుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
Read Also: CM Revanth Reddy: ఫీజు రీయింబర్స్మెంట్ పై సీఎం శుభవార్త..
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఇక, చంద్రబాబు హయంలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిందని అన్నారు హర్షకుమార్.. చంద్రబాబు వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బ్బతింది.. నిర్ధేషిత లోతులోకి నిర్మించకపోవడం వల్లే అది కొట్టుకుపోయిందని మ్యాప్ లో చూపించి వివరించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అయిన ఖర్చు ఆ అధికారులు నుంచే వసూళ్లు చేయాలని డిమాండ్ చేశారు. రెండు డయాఫ్రమ్ వాల్స్ నిర్మించాల్సివుండగా ఒక్కటే నిర్మించారని ఆరోపించారు. ఇంటికి పునాది ఎలాగో ప్రాజెక్టుకు డయాఫ్రమ్ వాల్ అలాగే నిర్మిస్తారని, అలాంటిది నిర్లక్ష్యం తో నిర్మించడం వల్ల ప్రాజెక్టు లో కీలక మైన అది కొట్టుకుపోయిందని వివరించారు. తాను చెప్పినవి నిజంకాదని ఇంజనీర్లు ఎవరైనా రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్.
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..