Gutta sukender Reddy About munugode by poll
మునుగోడు ఉప ఎన్నికకు ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల రూపాయి విలువ పడిపోయే స్థాయికి వచ్చిందన్నారు. దేశంలో మతాలు, కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ లక్ష్యమని ఆయన ఆరోపించారు.
Also Read : రోజూ ఈ డ్రింక్స్ తీసుకుంటే..మధుమేహం చిటికెలో మటుమాయం
దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు బీజేపీ శ్రేణులు పూనుకున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి ఒక్క టీఆర్‌ఎస్ తోనే సాధ్యమని, మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడుకు రోజుకు ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు విజ్ఞులు, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి మునుగోడు అభివృద్ధి చేసుకుంటారని ఆయన వెల్లడించారు.