చెడు ఆహార పదార్ధాలు, జీవనశైలి కారణంగా మధుమేహం చాలా వేగంగా విస్తరిస్తోంది.
ప్రతి పదిమందిలో 5-6 మందికి డయాబెటిస్ ఉందంటే అతిశయోక్తి కాదు. డయాబెటిస్ కారణంగా హార్ట్, కిడ్నీ,లివర్, కళ్లకు సంబంధించిన వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
మరి డయాబెటిస్ రోగులు ఏం తినాలి, ఏం తినకూడదో ఇప్పుడు పరిశీలిద్దాం.
కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ రోజూ ఉదయం పరగడుపున తీసకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఆ డ్రింక్స్ ఏంటనేది చూద్దాం.
డయాబెటిస్ రోగులకు కీరా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, బీ, సి, డీ వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి.
వీటితోపాటు కీరాలో నీళ్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున కీరా జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
టొమాటోను కూర రూపంలో లేదా సలాడ్ రూపంలో కాకుండా జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
టొమాటో జ్యూస్ డయాబెటిస్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే టొమాటోలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి.
డయాబెటిస్ రోగులకు కాకరకాయ చాలా మంచిది. ఉదయం పరగడుపున కాకరకాయ జ్యూస్ తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
కాకరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు దోహదపడతాయి.