NTV Telugu Site icon

Pemmasani Chandrashekar: పెమ్మసానికి అడుగడుగునా జన నీరాజనం

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar: గుంటూరు జిల్లాలోని కాకుమాను మండల పర్యటనలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేటూరు, అప్పాపురం, పెదనందిపాడు, కాకుమాను గ్రామాల్లో పర్యటించిన పెమ్మసానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రచార రథం వెంటనే నడుస్తూ జేజేలు పలికారు. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, తదితర టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు జగన్ కొత్తగా ఇవ్వడం లేదని విమర్శించటారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుమించిన పథకాలు అందజేశారన్నారు. ఒక వ్యక్తికి ఉద్యోగం అందిస్తే, నెలకి రూ. 30,000 సంపాదించుకోగలిగిన అవకాశం కల్పిస్తే సంక్షేమ పథకాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఫిల్టర్ బెడ్స్ శుభ్రం చేయాలి, చెరువులకు నీరు అందించాలి, నిర్వహణ చేపట్టాలి, ఇవన్నీ సరైన క్రమంలో జరిగితేనే ప్రజలకు సరైన సమయంలో తాగు, సాగునీరు అందుతుందన్నారు. ప్రజలకు ఆపద వచ్చిందని తెలిస్తే చంద్రబాబు వెంటనే వచ్చి పరిష్కారం చూపిస్తారన్నారు.

Read Also: Telangana Heavy Rains: నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ..

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు సమయం కేటాయించి 70 శాతానికి పైగా పనులు పూర్తి చేయించారన్నారు. ఇలా నాలుగింట మూడు వంతుల వంతు ప్రాజెక్టు పూర్తయిన పోలవరం పై కాంట్రాక్టర్లు మార్చడం, బిల్లులు ఆపేయడం వంటి పనుల వల్ల పోలవరం అర్ధాంతరంగా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. మరో నెలలో మా ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమాజంలో ప్రజలను సమతుల్యంగా ముందుకు నడిపించడం మాత్రమే చంద్రబాబుకు తెలుసన్నారు. ఆయన నాయకత్వంలో ఢిల్లీలోని ప్రతి గల్లీ తిరిగైనా సరే నిధులు సమీకరించి అభివృద్ధి చేయగల సమర్థత తనకు ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధులు సమీకరించి డ్రైనేజీ రోడ్లు మంచినీటి పథకాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు అందేలా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.. కాకుమాను గ్రామంలో స్థానికుల కోరిక మేరకు అడిగిన ఆర్వో ప్లాంట్ పై అంశంపై మాట్లాడుతూ.. ఎన్నికల వెంటనే ఆరో ప్లాంట్ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి ప్రజలందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ప్రజలను కోరారు.